కలశాలతో అమ్మవారి విగ్రహాలు ఊరేగింపు

కలశాలతో అమ్మవారి విగ్రహాలు ఊరేగింపు

AKP: ఎస్ రాయవరం మండలం పెదగుమ్ములూరులో పునర్నిర్మించిన నూకాంబిక, మరిడిమాంబ ఆలయాలు ప్రారంభంతో పాటు విగ్రహాల ప్రతిష్ట వైభవంగా ఈనెల 5న నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా మంగళవారం కలశాలతో పాటు ప్రతిష్టించే విగ్రహాలతో గ్రామంలో మేళ తాళాలు తప్పెటగుళ్లుతో ఊరేగింపు నిర్వహించారు. నాలుగవ తేదీ ఉదయం గణపతి పూజ, హోమాలు జరుగుతాయని ఆలయ ఛైర్మన్ వినోద్ రాజు తెలిపారు.