ట్రాక్టర్ ప్రమాద బాధితులను పరామర్శించిన బూర్ల

ట్రాక్టర్ ప్రమాద బాధితులను పరామర్శించిన బూర్ల

గుంటూరు: పెదనందిపాడు మండల పరిధిలోని ప్రధాన రహదారిపై మంగళవారం ట్రాక్టర్, ఆటో ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన వారిని ప్రతిపాడు టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి పరామర్శించారు. క్షతగాత్రులను అన్ని విధాల ప్రభుత్వ ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తమ వంతు సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు.