IPL ముందు PSL నిలవలేకపోతోంది: షెహ్‌జాద్
ప్రారంభంలో దూసుకెళ్లిన PSL గ్రాఫ్.. కొన్నేళ్లుగా పడిపోతోందని పాక్ మాజీ ప్లేయర్ అహ్మద్ షెహ్‌జాద్ అన్నాడు. క్రికెట్ రిచ్ లీగ్ IPLలోని ఫ్రాంచైజీల కోసం కొందరు ప్లేయర్లు ఇంటర్నేషన్ రిటైర్మెంట్ కూడా తీసుకుంటున్నారని.. PSLలో ఆటగాళ్లను నిలుపుకోవడమే పెద్ద సవాలుగా మారిందన్నాడు. భారత్‌లోనే కాక.. అన్ని క్రికెట్ లీగ్స్‌లోనూ IPL అనుబంధ జట్లు ఉన్నాయని గుర్తుచేశాడు.