సీఎం పర్యటనపై పోలీసులకు SP దిశా నిర్దేశం.!
ELR: ఉంగుటూరు మండలంలో సోమవారం సీఎం పర్యటన ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జిల్లా SP ప్రతాప్ శివకిషోర్ పర్యటించే ప్రాంతాల్లో చేపట్టవలసిన బందోబస్తు ఏర్పాటుపై బ్రీఫింగ్ నిర్వహించారు. అనంతరం పోలీసు అధికారులకు ఆదివారం దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమం ప్రారంభం నుంచి ముగిసేవరకు ప్రతి అధికారి సిబ్బంది బాధ్యతాయుతంగా, అప్రమత్తంగా తమ విధులు నిర్వహించాలన్నారు.