'ధర్మారంలో టెన్త్ జీవశాస్త్రం పరీక్ష ప్రశాంతం'
PDPL: ధర్మారం మండలంలో ఇవాళ నిర్వహించిన 10వ తరగతి జీవశాస్త్రం పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని ఎంఈవో ప్రభాకర్ తెలిపారు. మొత్తం ఐదు కేంద్రాలలో 100% విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు వెల్లడించారు. ఎక్కడ మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు.