'బాధితులకు సత్వర న్యాయం చేయాలి’

NRPT: ప్రజావాణి కార్య క్రమంలో ఫిర్యాదులతో వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలని ఎస్పీ యోగేశ్ గౌతమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ఆయన, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చట్టం ప్రకారం సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.