పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

WGL: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మొగుళ్ళపల్లి మండలం రంగాపురం గ్రామంలో ఇవాళ చోటు చేసుకుంది. ఎస్సై అశోక్ ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీరామ్ రాజీరు (68) మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కేసు నమోదు అయింది. వివరాలు తెలియాల్సి ఉంది.