VIDEO: ఘనంగా లక్ష దీపోత్సవం
SRD: సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట (ఈశ్వరపురం) దుర్గాభవాని ఆలయ వార్షికోత్సవం సందర్భంగా లక్ష దీపోత్సవ కార్యక్రమం సోమవారం రాత్రి నిర్వహించారు. దీపాలతో ఆలయ ప్రాంగణం వెలుగులతో నిండిపోయింది. మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని ఆలయ ఆవరణలో దీపాలను వెలిగించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను జరిపించారు.