వేట్లపాలెం ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం పంపిణీ
కాకినాడ: సామర్లకోట మండలం వేట్లపాలెం బాణాసంచా ప్రమాద బాధిత కుటుంబాలకు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అందించిన ఆర్థిక సహాయాన్ని డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అందించారు. వేట్లపాలెం మేడపాడు సామర్లకోట పరిధికి చెందిన కుటుంబాలకు రూ. 25వేల నగదు నిత్యవసర సరుకులను అందించారు. ఎమ్మెల్యే తనయుడు నిమ్మకాయల రంగనాగ్, రైస్ మిల్లర్స్ సభ్యులు పాల్గొన్నారు.