BSNL ఉద్యోగుల సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావన

BSNL ఉద్యోగుల సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావన

KNRL: BSNL ఉద్యోగుల ఎదుర్కుంటున్న సమస్యలను కర్నూలు ఎంపీ నాగరాజు పార్లమెంటులో ప్రస్థావించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో భాగంగా జీరో అవర్‌లో ఎంపీ నాగరాజు మాట్లాడారు. BSNL ఉద్యోగులు ప్రకృతి విపత్తులు, జాతీయ అత్యవసర పరిస్థితులు, కోవిడ్ లాంటి క్లిష్ట సమయాల్లో దేశానికి నిబద్ధతతో సేవలు అందించారన్నారు. విధి నిర్వహణలో ఉద్యోగులు ప్రాణాలు అర్పించారన్నారు.