చిలకలూరిపేటలో లాయర్ దారుణ హత్య
PLD: చిలకలూరిపేట మండలం చీమకుర్తి వాసి లాయర్ శ్రీరామ్ హరి ప్రసాద్ రోడ్డుపై దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు అతనిపై స్కూటీ పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వృత్తి రీత్యా అతడు లాయర్ కావడంతో ఇది ప్రమాదమా? లేక హత్యా అనే కోణంలో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.