పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డీఎస్పీ

పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డీఎస్పీ

అన్నమయ్య: జిల్లాలోని తంబళ్లపల్లె పోలీస్ స్టేషన్‌ను మదనపల్లె డీఎస్పీ మహేంద్ర సోమవారం తనిఖీ చేశారు. సోమవారం మొలకలచెరువు సీఐ లక్ష్మణ్‌తో కలిసి తంబళ్లపల్లికి చేరుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఎస్సై లోకేష్ రెడ్డిని పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.