నేడు గుర్జాల్‌లో కుస్తీ పోటీలు
KMR: గాంధారి మండలం గుర్జాల్‌లో హోలీ పండుగ సందర్భంగా గురువారం మధ్యాహ్నం 3:30 నుంచి కుస్తీ పోటీలు నిర్వహించనున్నట్లు సర్పంచ్ గంగారాం తెలిపారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ పోటీలను విజయవంతం చేయాలని, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సూచించారు.