వైభవంగా రామయ్య నిత్య కళ్యాణం
BDK: భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణ వేడుక సోమవారం కనుల పండుగగా అర్చకులు నిర్వహించారు. ఉదయం మూలవరులకు సుప్రభాత సేవ, ఆరాధన అనంతరం బేడా మండపంలో అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.