నేడు పాలకొల్లు రానున్న మంత్రి నారా లోకేష్

W.G: రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆదివారం పాలకొల్లు రానున్నారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు కుమార్తె శ్రీజ నిశ్చితార్థం వేడుకల్లో ఆయన పాల్గొనున్నారు. స్థానిక బ్రాడీపేట బైపాస్ రోడ్డులో ఎస్ కన్వెన్షన్ కళ్యాణ మండపంలో ఉదయం ఏడు గంటలకు జరిగే నిశ్చితార్థ వేడుకలో రాష్ట్ర మంత్రి లోకేష్ పాల్గొంటారని మంత్రి కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలియజేసింది.