అక్రమ కలప తరలింపు.. పట్టించుకోని అధికారులు
MBNR: నవాబ్‌పేట మండలంలో జోరుగా కలప అక్రమ రవాణా చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొక్కలు నాటుతుంటే వ్యాపారులు నరికివేస్తున్నారు. పగలే రోడ్డుపై అక్రమంగా కలప తరలిస్తున్న కూడా పోలీసులు, అధికారులు పట్టించుకోవట్లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.