మూసాపేటలో అగ్నిప్రమాదం
MDCL: కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధి మూసాపేటలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గ్రామంలోని ఓ బైక్ మెకానిక్ షాప్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. కాగా, షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.