మద్యంమత్తులో తల్లిదండ్రులను చంపిన కొడుకు..!

మద్యంమత్తులో తల్లిదండ్రులను చంపిన కొడుకు..!

NDL: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మందుకు బానిసైన ఓ వ్యక్తి తల్లిదండ్రులను ఇవాళ కడతేర్చాడు. రోజు డబ్బుల కోసం వారిని వేదించే వాడని స్థానికులు తెలిపారు. ఈ రోజు కూడా డబ్బులు కోసం తల్లిదండ్రులను అడగగా వారు నిరాకరించంటంతో ఘర్షణ జరిగినట్లు వారు పేర్కొన్నారు. దీంతో కోపంలో కొడుకు తల్లిదండ్రులపై దాడి చేయగా అక్కడిక్కడే చనిపోయినట్లు స్థానికులు తెలియజేశారు.