ఘనంగా ముగిసిన సాలకట్ల వసంతోత్సవాలు
TPT: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వెనుక వైపున ఉన్న వసంతోత్సవ మండపంలో గత మూడు రోజులుగా అంగరంగ వైభవంగా నిర్వహించిన సాలకట్ల వసంతోత్సవాలు బుధవారం కన్నులపండుగగా ముగిశాయి. ఉత్సవాల సందర్భంగా స్వామివారు, ఉభయ దేవేరులు ప్రత్యేక అలంకరణలతో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో వీక్షించారు.