ఆలయాలకు పోటెత్తిన భక్తులు
BPT: కార్తీకమాసం చివరి సోమవారం సందర్భంగా చీరాల, చినగంజాం, పర్చూరు ప్రాంతాల్లోని శైవ క్షేత్రాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు బారులుతీరి శివయ్యను దర్శించుకుని, పత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో కార్తీకదీపాలు వెలిగించడంతో ఆ ప్రాంతాలు దీపాల వెలుగులతో శోభాయమానంగా మారాయి. అనంతరం భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.