అన్ని బంధాల కంటే.. స్నేహబంధం గొప్పది

NZB: అన్ని బంధాల కంటే స్నేహబంధం చాలా గొప్పదని పూర్వ విద్యార్థులు అన్నారు. 1997-98వ బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆలూర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. 25సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులుహాజరు కావడంతో ఆ స్కూల్ వాతావరణం సందడిగా మారింది. ఒకరినొకరు కలుసుకొని తీపి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.