ఓటర్లను ఆకట్టుకున్న మోడల్ పోలింగ్ కేంద్రం

NRML: జిల్లా కేంద్రంలోని ఈద్గాం కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన మోడల్ పోలింగ్ కేంద్రం ఓటర్లను ఆకట్టుకుంది. పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లు వచ్చే దారిలో గ్రీన్ మ్యాట్, కేంద్రం లోపల మామిడి తోరణాలతో అలంకరించారు. మోడల్ పోలింగ్ కేంద్రాన్ని అందంగా తీర్చిదిద్దిన ఎన్నికల అధికారులను పలువురు అభినందించారు.