మానవత్వం చాటుకున్న నటుడు విజయ్
పుదుచ్చేరి ఎన్నికల రోడ్ షోలో టీవీకే అధినేత విజయ్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. జనసమూహంలో తన వ్యాన్ వద్దకు వచ్చిన ఒక వృద్ధుడిని భద్రతా సిబ్బంది నెట్టివేయగా.. విజయ్ వెంటనే స్పందించి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా ప్రవర్తించవద్దని సిబ్బందిని వారించి, వృద్ధుడి పక్షాన నిలిచిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆయన వ్యవహరించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.