ఎరువుల పంపిణీలో సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలి

ELR: జిల్లాలోని సొసైటీలకు, డీలర్లకు రానున్న వారానికి అవసరమైన యూరియా, ఇతర ఎరువులను సరఫరా చేయడం జరిగిందని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. మండల పరిధిలో ప్రస్తుత ఎరువుల నిల్వలు, రానున్న వారానికి అవసరమైన ఎరువుల వివరాలను మండల వ్యవసాయాధికారి వారీగా ఆరా తీశారు. ప్రైవేట్ డీలర్ల వద్ద పెద్దమొత్తంలో యూరియా నిల్వ లేకుండా చూడాలన్నారు.