బోయకొండకు పోటెత్తిన భక్త జనం

CTR: పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. వసంత పంచమి సందర్భంగా మహిళలు ఉపవాస దీక్షలతో చేరుకొని అమ్మవారికి నైవేధ్యం సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. సుమారు 25 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోనున్నట్లు ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం వెల్లడించారు.