రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు

రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు

ELR: రాంగ్ రూట్‌లో హైవే దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటన ఏలూరు జాతీయ రహదారిలోని సూరప్పగూడెం సమీపంలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. క్షతగాత్రులు ఎం. కొండయ్య, టి.రామకృష్ణులుగా గుర్తించారు. వీరిని హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది