జిల్లా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

జిల్లా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

NRPT: జిల్లా ప్రజలకు ఎస్పీ జి. వినీత్ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీరాముని జీవితం ధర్మం, సత్యం, నీతికి నిదర్శనమని, ఆయన అడుగుజాడల్లో నడవడం మనందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఈ పవిత్ర పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సౌభాగ్యాలను నింపాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీరామనవమి వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.