జమ్మికుంట మార్కెట్‌లో నిలకడగా పత్తి ధర
KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీలో మంగళవారం పత్తి ధరలు సోమవారం లాగే నిలకడగా కొనసాగాయి. మంగళవారం మార్కెట్‌లో 13 వాహనాల్లో 114 క్వింటాళ్ల దిగుబడి రాగా.. గరిష్ఠంగా రూ.7,950, కనిష్టంగా రూ. 6,500 పత్తి ధర పలికింది. మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి రాజా, అధికారులు, ప్రైవేట్ వ్యాపారులు లావాదేవీలను పర్యవేక్షించారు.