భార్యను చంపిన భర్త సూసైడ్

TPT: చంద్రగిరి నియోజకవర్గం మంగళం సమీపంలో ఇవాళ తెల్లవారుజామున ఉష తన భర్త లోకేశ్వర్ చేతిలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే హత్య అనంతరం లోకేశ్వర్ సైతం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరుమల నగర్‌లోని ఆయన ఇంటిలో ఉరి వేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. అదనపు ఎస్పీ రవిమనోహరాచారి, సీఐ సునీల్ కుమార్ ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు.