ఏసీపీగా టీమిండియా క్రికెటర్ బాధ్యతలు

ఏసీపీగా టీమిండియా క్రికెటర్ బాధ్యతలు

టీమిండియా మహిళా క్రికెటర్ రీచా ఘోష్ ACPగా బాధ్యతలు స్వీకరించింది. వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచిన జట్టులో సభ్యురాలుగా ఉన్న రీచాను బెంగాల్ ప్రభుత్వం ACPగా నియమించింది. తాజాగా ఆమె ACPగా ఛార్జ్ తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, రీచా ఘోష్ పేరుతో బెంగాల్‌లో ఒక నూతన స్టేడియాన్ని నిర్మిస్తామని సీఎం మమతా బెనర్జీ ప్రకటించిన విషయం కూడా తెలిసిందే.