ఒక్క ఫోన్ కాల్‌తో సమస్యకు పరిష్కారం
VSP: మహిళలు, పిల్లలపై జరుగుతున్న నేరాలను అరికట్టడానికి జిల్లా పోలీసులు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఏదైనా సమస్య వస్తే భయపడకుండా మాట్లాడాలని అది వారి బాధ్యత అని గుర్తు చేశారు. అలాగే, ఎలాంటి వేధింపులు, హింస, సైబర్ నేరాలను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అత్యవసర సహాయం కోసం 112, 181, 1091 నెంబర్‌లకి కాల్ చేయాలని సూచించారు.