నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KMM: కూసుమంచి మండలం జీళ్లచెరువు సబ్ స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ అశోక్ తెలిపారు. సబ్ స్టేషన్ లో చేపట్టనున్న అత్యవసర మరమ్మతు పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు నేలపట్ల, మునిగేపల్లి, అగ్రహారం, వాటర్ గ్రిడ్ ప్రాంతాలు కరెంట్ ఉండదన్నారు.