VIDEO: మొగల్తూరులో వినాయక చవితి ఉత్సవాల ముగింపు

W.G: మొగల్తూరులోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద స్నేహ ట్రక్, ఆటో యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం భారీ అన్న సమారాధన జరిగింది. ఇటీవల ఘనంగా జరిగిన వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్సై జి. వాసు ఈ అన్న సమారాధనను ప్రారంభించారు. ఆటో యూనియన్ సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.