VIDEO: వెలుగోడు కేడీసీసీ బ్యాంక్ సిబ్బంది నిరసన
NDL: వెలుగోడులోని కేడీసీసీ బ్యాంక్, సహకార సిబ్బంది విధులు బహిష్కరించి సోమవారం బ్యాంకు ముందు నిరసన చేపట్టారు. డీఎఫ్ఎల్ ద్వారా నిరవధికంగా జీతభత్యాలు చెల్లించాలని, రిటైర్మెంట్ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. రైతు సంఘాల ద్వారానే రైతులకు పంట రుణాలు అందించాలని, జీవో నెంబర్ 36ను అమలు చేయాలని కోరారు.