ఎలుకల మందు తాగి యువకుడు ఆత్మహత్య

ఎలుకల మందు తాగి యువకుడు ఆత్మహత్య

అన్నమయ్య: మదనపల్లెలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువకుడు ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకెళ్తే రామారావు కాలనీకి చెందిన శివ(24) కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్థాపానికి గురై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అతన్ని మొదట స్థానిక ఆస్పత్రికి, ఆపై తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.