ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: MLA
JGL: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల మండలంలోని బాలపెల్లి గ్రామానికి చెందిన బేతి భూమారెడ్డి దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఇవాళ ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి చీరను బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, నాయకులు బాల ముకుందం, తదితరులు పాల్గొన్నారు.