శబరిమలలో కొనసాగుతున్న భక్తుల తాకిడి
శబరిమలలో అయ్యప్పస్వాముల రద్దీ కొనసాగుతోంది. పంబ తీర్థం స్వామియే శరణం అయ్యప్ప ప్రతిధ్వనులతో మారుమోగిపోతుంది. ఏ వైపు చూసినా అయ్యప్పస్వాములే దర్శనమిస్తున్నారు. గత ఏడాది ఈ సమయం వరకూ దాదాపు 21 లక్షల మంది స్వామివారి దర్శనం చేసుకోగా ప్రస్తుతం ఆసంఖ్య 25 లక్షలు దాటిందని ట్రావెన్ కోర్ దేవస్థానం తెలిపింది.