బండలాగుడు పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
KDP: ఖాజీపేటలోని నాగనాదేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా వృషభరాజుల బండలాగుడు పోటీలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు ఆలయ ఛైర్మన్ గంగవరం వెంకట సూర్య సుమన్ రెడ్డి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ ఆశీస్సులతో నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలకు రూ.50 వేల, రూ.40 వేల, రూ.30 వేల నగదు బహుమతులను అందజేశారు.