పాఠశాల అభివృద్ధికి విరాళం

పాఠశాల అభివృద్ధికి విరాళం

సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో బీసీ కాలనీ పాఠశాలకు కాంగ్రెస్ నాయకులు 6500 చెక్కును పాఠశాల హెచ్ఎం జైపాల్ యాదవ్‌కు అందజేశారు. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దేవులపల్లి యాదగిరి మాట్లాడుతూ.. విద్య అనేది సమాజ పూరోగతికి మూల స్తంభమని మన భవిష్యత్ తరాలకు మెరుగైన విద్య అందించడం మన అందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ యాదగిరి, నాగరాజు పాల్గొన్నారు.