విద్యార్థికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం

SKLM: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం దండుగోపాలపురం జిల్లా పరిషత్ ఉన్నతి పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న మండల వేణు అనే విద్యార్థి ఇటీవల బోన్ క్యాన్సర్ బారిన పడ్డాడు. అతను ఆపరేషన్‌కి సుమారు 25 లక్షలు అవుతుందని డాక్టర్ నిర్ధారించారు. ఈ విషయం తెలిసిన పాఠశాల ఉపాధ్యాయులు మిత్ర బృందం మంగళవారం లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారు.