ఈనెల 23, 24, 25 తేదీల్లో రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ టోర్నమెంట్
ప్రకాశం: సింగరాయకొండ జూనియర్ కాలేజీ ఆవరణంలో ఈనెల 23, 24, 25 తేదీలలో స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో అండర్-19 రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఎస్జీఎఫ్ సెక్రటరీ చింపారెడ్డి తెలిపారు. గురువారం టోర్నమెంట్‌కు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ రాజాబాబు ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు.