వాహన తనిఖీలు.. 18 వాహనాలకు జరిమానా
VZM: డెంకాడ పోలీసు స్టేషన్ పరిధి పెదతాడివాడ కూడలిలో ఎస్సై ఏ. సన్యాసి నాయుడు, సిబ్బందితో శనివారం వాహన తనిఖీలు చేపట్టారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపకూడదని సూచించారు. తనిఖీ సమయంలో పత్రాలు వెంట ఉండాలని కోరారు. వాహన పత్రాలు లేని 18 వాహనాలపై, రూ 10,980 జరిమానా విధించినట్లు చెప్పారు. మూడు వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించమన్నారు.