ఆశ వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలి

NRML: రాష్ట్రంలో ఆశ వర్కర్లకు రాత పరీక్ష నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆశ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు చంద్రకళ డిమాండ్ చేశారు. శనివారం రాం నగర్ PHCలో వినతి పత్రం అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆశ వర్కర్లకు కనీస వేతనం రూ.18వేలు అమలు చేయాలని కోరారు.