జమ్ములమ్మ ఆలయంలో చోరీ
GDWL: అయిజ పట్టణంలోని ఊరి చివర ఉన్న జమ్ములమ్మ ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున చోరీ జరిగిందని స్థానికులు తెలిపారు. గుర్తు తెలియని దుండగులు ఆలయంలోని పూజా సామాగ్రిని, భక్తులు సమర్పించిన చీరలను కూడా దోచుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనపై మండల పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.