ఆళ్లగడ్డలో 50 పడకల ఆసుపత్రి ప్రారంభం
NDL: ఆళ్లగడ్డ పట్టణంలో నూతనంగా నిర్మించిన 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ మంగళవారం ఉదయం ప్రారంభించారు. సదుపాయాలను పరిశీలించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు ఈ ఆసుపత్రి ఎంతో ఉపయోగకరంగా నిలవనుందని తెలిపారు.