ప్రధానోపాధ్యాయుడుకి కలెక్టర్ ప్రశంస పంత్రం అందజేత
KMR: బాన్సువాడలోని బోర్లం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ‘స్వచ్ఛత ఏవం హరిత విద్యాలయ రేటింగ్–2025’లో పాఠశాల 94.40% స్కోర్ సాధించి 5 స్టార్ రేటింగ్‌ను కైవసం చేసుకుంది. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వన్ ప్రధానోపాధ్యాయుడు వెంకటరమణకు ప్రశంసాపత్రం అందచేశారు.