VIDEO: ‘జై తెలంగాణ’ అనని వ్యక్తి సీఎం అయ్యాడు: కేటీఆర్
WGL: జీవితంలో ఒక్కసారి కూడా ‘జై తెలంగాణ’ అనని వ్యక్తి ఇవాళ సీఎంగా ఉన్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఘాటు విమర్శలు చేశారు. ఇవాళ ముఖ్య కార్యకర్తల సమావేశంలో KTR మాట్లాడుతూ.. మరో రెండేళ్లు ఇబ్బందులు తప్పవని, కేసులకు భయపడొద్దని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. కేసీఆర్ స్ఫూర్తితో సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో అందరూ కృషి చేయాలని KTR పిలుపునిచ్చారు.