VIDEO: రాజంపేటలో వెలవెలబోయిన మాంసం దుకాణాలు
అన్నమయ్య: రాజంపేట ప్రాంతంలో రంజాన్ రోజు మాంసం దుకాణాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈసారీ ఆ పరిస్థితి కనిపించలేదు. వ్యాపారులు అన్నీ సిద్ధం చేసుకున్నప్పటికీ.. కొనుగోలుదారులు రాకపోవడంతో నిరాశగా ఎదురు చూస్తున్నారు. గల్ఫ్ యుద్ధం కారణంగా తమ కుటుంబ సభ్యులు అక్కడ ఎలా ఉన్నారోననే ఆందోళనలో రాజంపేట ప్రజలు ఉన్నారు. ఈ క్రమంలో కొందరు రంజానుకు దూరంగా ఉన్నారు.