ఇనగలూరులో పశు వైద్య శిబిరం
KDP: తొండూరు మండలం ఇనగలూరులో ఇ పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని పశుసంవర్ధక శాఖ ఏడీ అమర్నాథ్ రెడ్డి తనిఖీ చేశారు. గొర్రెలకు నీలి నాలుక వ్యాధి వచ్చే ఆస్కారం ఉందన్నారు. వ్యాధి నివారణకు సాయంత్రం వేళ వేపాకుతో పొగ వేయాలన్నారు. గొర్రెలకు వచ్చే జబ్బుల గురించి అడిగి తెలుసుకుని వాటి నివారణకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు.