అంగన్వాడీ కార్యకర్తలకు 5జీ ఫోన్లు అందజేత
ATP: రాప్తాడు ఎంపీడీవో కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లకు ఎమ్మెల్యే పరిటాల సునీత 5జీ మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు. రాప్తాడు, అనంతపురం రూరల్, ఆత్మకూరు మండలాలలోని 179 మంది అంగన్వాడీ కార్యకర్తలకు, 8 మంది సూపర్వైజర్లకు ఫోన్లు ఇచ్చారు. అలాగే, 16 మంది మినీ వర్కర్స్‌కు మెయిన్ వర్కర్స్‌గా ఉన్నతీకరణ పత్రాలు అందజేశారు.